గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి

గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి

 ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్స్టర్, పొలిటికల్  లీడర్ ముఖ్తార్ అన్సారీ గురువారం (మార్చి 28) గుండెపోటుతో మృతిచెందారు. గురువారం సాయంత్రం గుండెపోటు రావడంతో అన్సారీని బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అన్సారి మృతి చెందినట్లు ఆస్పత్రి సిబ్బంది నిర్దారించారు. 

ముఖ్తార్ అన్సారీ మృతితో మౌ, గాజీపూర్, బండా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. బందా మెడికల్ కాలేజీ వెలుపల భారీ సంఖ్యలో పారామిలిటరీ బలగాలను మోహరించారు. అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. 

ముఖ్తార్ అన్సారీ (60 ), మాజీ గ్యాంగస్టర్, పొలిటికల్ లీడర్, 2005 నుంచి పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో జైలులో ఉన్నాడు. అన్సారీపై 60 కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎనిమిది కేసుల్లో దోషిగా బండా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.