కేసీఆర్ లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటో ఆలోచించాలి : గంగుల

కేసీఆర్ లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటో ఆలోచించాలి : గంగుల

దేశం మొత్తంలో పండించిన ప్రతీ గింజను కొనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు.  కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎన్నో అరి గోసలు పడ్డామని కానీ ఇప్పుడా పరిస్థితి లేదని గంగుల అన్నారు. కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం  ప్రాజెక్టు కడితే ఇప్పుడు నిండుగా నీళ్ళు ఉన్నాయన్నారు. 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతులు సంతోషంగా ఉన్నారని, భూమికి బరువు అయ్యే అంత పంట పండుతోందని గంగుల తెలిపారు. దండం, దరఖాస్తులు లేకుండానే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతున్నాయన్నారు. ఢిల్లీ పాలకుల కళ్ళు తెలగాణ మీద పడిందని.. ఇక్కడి నీళ్ళు, విద్యుత్, బొగ్గులను తీసుకెళ్లాలని చూస్తున్నారని గంగుల  ఆరోపించారు. కేసీఆర్ లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటో ఒక్కసారి అలోచించుకోవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు.