భారీ మెజారిటీతో హుజురాబాద్లో గెలుస్తం : గంగుల కమలాకర్

 భారీ మెజారిటీతో హుజురాబాద్లో గెలుస్తం : గంగుల కమలాకర్

2023 ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలువబోతుందని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి కేటీఆర్ సభకు సంబంధించిన ఏర్పాట్లను గంగుల పరిశీలించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ ఓటమి చెందిందని చెప్పారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పిన గంగుల.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ సీఎం కాకముందు హుజురాబాద్ ఎలా ఉందో.. ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత జమ్మకుంటలో జరగబోతున్న మొదటిసభ కావడంతో కనీవినీ ఎరుగని రీతిలో సభను విజయవంతం చేయాలని ప్రజలను, కార్యకర్తలను గంగుల కోరారు.