బొత్స మా జోలికి రావొద్దు.. హైదరాబాద్​లో అడుగు పెట్టకు

బొత్స మా జోలికి రావొద్దు.. హైదరాబాద్​లో అడుగు పెట్టకు

ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో  పోల్చి చూడటం సరికాదు అంటూ ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..   

'ఉమ్మడి ఏపీలో విద్యా వ్యవస్థ ఫెయిల్ అయింది. బొత్స నువ్వు తెలుసుకో...  నీ దగ్గర గురుకుల పాఠశాలలున్నాయి.. తెలంగాణలో ఎన్ని ఉన్నాయ్​ చూడు.  నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు.. నీ దగ్గర విద్యా వ్యవస్థ ఉందా.. నువ్వా మా విద్యార్థుల గురించి మాట్లాడేది. మా దగ్గర 1,009 గురుకులాలు ఉంటే.. నీ దగ్గర 289 కూడా లేవు.. టీఎస్‌పీఎస్​సీ లో దొంగలను పట్టుకుంది మేమే. ఏపీపీఎస్​సీ లో సీతారామరాజు అనే దొంగ అడ్డంగా దొరకలేదా. జగన్ దొంగ నాటకాలను ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ మీద ఇంకా కుట్రలేనా. హైదరాబాద్ లో అడుగు పెట్టకు.’’ అంటూ మండిపడ్డారు. 

మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు బడుల గురించి మాట్లాడిన  దాంట్లో తప్పేమీ లేదన్నారు. ఉమ్మడి పాలన పాపాలను కడిగేస్తున్నామని.. మన ఊరు– మన బడి కార్యక్రమాన్ని చేపట్టి బడులను బాగు చేస్తున్నట్లు తెలిపారు.