మైగ్రెంట్ వర్కర్స్ సమస్యలు సాల్వ్ చేయండి

మైగ్రెంట్ వర్కర్స్ సమస్యలు సాల్వ్ చేయండి
  • రాష్ట్రాలకు కేంద్ర మంత్రి సంతోష్ గాంగ్వార్ లేఖ

న్యూఢిల్లీ: మైగ్రెంట్ వర్కర్స్ ఇబ్బందులను పరిష్కరించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్స్ తో కలిసి పని చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ అన్నారు. ప్రధాని మోడీ మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన వెంటనే మైగ్రెంట్ వర్కర్స కోసం దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటికి వస్తున్న ఫిర్యాదులు ఎక్కువగా రాష్ట్రాలకు సంబంధించినవేనన్నారు. అన్ని రాష్ట్రాలు లేబర్ డిపార్ట్ మెంట్ నుంచి నోడల్ ఆఫీసర్లను నియమించి మైగ్రెంట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీలకు ఆయన లెటర్లు రాశారు. తాము ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్ కు 2,100 ఫిర్యాదులు అందాయని, వీటిలో 1400 ఫిర్యాదులు రాష్ట్రాలకు సంబంధించినవేనని అన్నారు.