హైదరాబాద్ జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం... ప్రశ్నించిన మహిళలపై ఇద్దరు యువకుల దాడి

హైదరాబాద్ జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం... ప్రశ్నించిన మహిళలపై ఇద్దరు యువకుల దాడి
  • పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు
  • న్యాయం చేయాలని పీఎస్​ వద్ద ధర్నా

జీడిమెట్ల, వెలుగు: గంజాయి బ్యాచ్ నుంచి తమను రక్షించాలంటూ జీడిమెట్ల పీఎస్ వద్ద పలువురు కాలనీ వాసులు ధర్నా చేశారు. ఎన్‌‌ఎల్‌‌బీ నగర్​లోని హనుమాన్ టెంపుల్ వద్ద కల్యాణ్ (20), సంఘీ (20) అనే ఇద్దరు సోమవారం రాత్రి గంజాయి సేవిస్తున్నారు. స్థానిక మహిళలు వారించడంతో దాడి చేశారు. దీంతో స్థానికులు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు. 

రోజురోజుకు కాలనీలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుందని, ప్రాణభయం ఉందన్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్​లో కూర్చుని నినాదాలు చేశారు. స్థానికులు ఫిర్యాదు చేసిన ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ తెలిపారు.