న్యూఢిల్లీ: ఈ ఏడాది డిసెంబర్ నాటికి బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 93 వేల 918 లెవెల్‌కు చేరుకుంటుందని వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్లయింట్ అసోసియేట్స్ (సీఏ) ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 84,900 స్థాయితో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. అంతేకాకుండా ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోని డైవర్సిఫై చేసుకోవాలనుకుంటే బంగారం, వెండిలలో ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం గ్లోబల్‌గా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో కమోడిటీలకు, ముఖ్యంగా బంగారం, వెండికి డిమాండ్ పెరిగిందని తెలిపింది.
సీఏ రిపోర్ట్ ప్రకారం, డాలర్ బలహీనంగా ఉండడం, జియో పొలిటికల్ అనిశ్చితుల కారణంగా 2025లో గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్ వంటి విలువైన మెటల్స్ ధరలు భారీగా పెరిగాయి. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్‌ను కొనుగోలు చేస్తుండడంతో, పసిడికి డిమాండ్ బాగా పెరిగింది. అమెరికా–చైనా మధ్య టెన్షన్లతో పాటు సప్లయ్ సమస్యలతో వెండికి కూడా డిమాండ్ ఎక్కువైంది.
వెండిని క్రిటికల్ లేదా రేర్ మెటల్‌గా వర్గీకరించాలనే చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్కెట్ మొత్తం పెరగదు. కానీ, కొన్ని నిర్ధిష్టమైన షేర్లు మంచి ర్యాలీ చేయొచ్చు. ఇన్వెస్టర్లు ఫండమెంటల్స్ బాగున్న షేర్లలో పెట్టుబడులు పెట్టాలి. 2025–26 లో ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 6.8 శాతం ఉంటుందని అంచనా.
