ముస్లిం దేశ కరెన్సీపై గణపతి బొమ్మ

ముస్లిం దేశ కరెన్సీపై గణపతి బొమ్మ

విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఓ ముస్లిం దేశంలో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు ఉండే ఇండోనేషియాలో వినాయకుడి బొమ్మను అక్కడి కరెన్సీపై ముద్రిస్తోంది. చాలా ఏళ్ల క్రితం ఇండోనేషియాలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి ప్రజలు ఎన్నోఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో  1998 లో ఆ దేశంలో 20 వేల రూపాయల కొత్త నోట్లను ముద్రించడం ప్రారంభించారు. అప్పటినుంచి వినాయకుడి ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించడం కూడా మొదలుపెట్టారు. అక్కడి ఆర్థికవేత్తలు ఓ బృందంగా ఏర్పడి కరెన్సీపై వినాయకుడి బొమ్మపై చర్చలు జరిపారట.  చివరికి బుద్ధికి సంకేతం వినాయకుడు కాబట్టి కరెన్సీపై గణేషుడి బొమ్మను ముద్రిద్దామని ఆ బృందం నిర్ణయించినట్టు  ఇండోనేషియా వాసులు చెబుతుంటారు.

అంతేకాదు ఇండోనేషియా సంస్కృతి, మన దేశ సంస్కృతి కాస్త దగ్గరగానే ఉంటాయి. ఇక్కడ  మన దేశంలో జరిగినట్టు అక్కడ కూడా హిందూ దేవతలను ఆరాధిస్తారు. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్నా.. హిందూ మత ప్రభావం మాత్రం ఉంటుంది. అందుకే అక్కడి కరెన్సీపై వినాయకుడి ప్రతిమ ముద్రించబడింది.