సిటీలో స్వచ్ఛతా హీ సేవ సక్సెస్

సిటీలో స్వచ్ఛతా హీ సేవ సక్సెస్

హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛతా హీ సేవలో  భాగంగా ప్రసాద్ ఐ మాక్స్ థియేటర్ వద్ద నటి అక్కినేని అమల,  సినీ రచయిత సుద్దాల అశోక్‌‌‌‌ తేజ, బల్దియా కమిషనర్‌‌‌‌‌‌‌‌ రోనాల్డ్‌‌‌‌ రోస్,  జోనల్ కమిషనర్ వెంకటేశ్ ​ధోత్రే  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రోడ్లను క్లీన్ చేసి, చెత్త కుప్పలను బ్యాగుల్లో వేసి స్వచ్ఛ వెహికల్స్ ద్వారా  కలెక్షన్ ట్రాన్స్ ఫర్ పాయింట్లకి పంపించారు. 

పద్మారావునగర్: గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సిటీలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు.  మహమ్మద్‌‌‌‌ గూడలోని అర్బన్​ ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఆస్పత్రి వార్డులు, బయట పరిశుభ్రత పనులను వైద్య సిబ్బంది నిర్వహించారు.  కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్​ డా. ఎలిజబెత్ రాణి, ఆశ కార్యకర్తలు ఉమా పాల్గొన్నారు. 

ముషీరాబాద్: పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్‌‌‌‌లో ఎంపీ లక్ష్మణ్​ పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.  జీహెచ్‌‌‌‌ఎంసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  బీజేపీ సీనియర్‌‌‌‌‌‌‌‌ నేతలు గోపాల్ రెడ్డి, రత్న సాయిచంద్  తదితరులు పాల్గొన్నారు. 

సికింద్రాబాద్: తార్నాక చింతల్ అంబేద్కర్ విగ్రహం నుంచి తార్నాక చౌరస్తా వరకు జరిగిన శ్రమదాన్  ప్రోగ్రాంలో  మాజీ  మేయర్ బండ కార్తీక రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నేతలు చంద్రారెడ్డి, శివారెడ్డి, వీరన్న, సంపత్​తదితరులు పాల్గొన్నారు.

శంషాబాద్ : మైలార్‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌ పల్లి డివిజన్‌‌‌‌ పరిధిలో జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ జీహెచ్‌‌‌‌ఎంసీ కౌన్సిల్ విప్‌‌‌‌ తోకల శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు.  

మెహిదీపట్నం:  గుడిమల్కాపూర్ డివిజన్‌‌‌‌లోని స్వామి వివేకానంద విగ్రహం కూడలి వద్ద గుడిమల్కాపూర్ డివిజన్ యువ నేత  దేవర వంశీ ఆధ్వర్యంలో  జీహెచ్‌‌‌‌ఎంసీ కార్మికులను సన్మానించారు. 

గండిపేట్: రాజేంద్రనగర్‌‌‌‌లోని ప్రొఫెసర్ జయశంకర్‌‌‌‌ వర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల వలంటీర్లు 200 మంది విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు.