ఆనంది ఫిమేల్ లీడ్‌గా నటించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 17న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన హీరో అడివి శేష్, దర్శకులు బాబీ కొల్లి, హరీష్ శంకర్, మారుతి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించాలని విష్ చేశారు. హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు దేవుడిచ్చిన వరం.
తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగు అమ్మాయిగా ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ప్రతి ఒక్కరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని చెప్పింది. డైరెక్టర్ గౌరీ నాయుడు మాట్లాడుతూ ‘మా గరివిడి లక్ష్మి (ఆనంది) స్టేజి ఎక్కితే నాకు పూనకం వచ్చేసేది. ఈ సినిమాలో తను ఆడిస్తుంది, పాడిస్తుంది, ఏడిపిస్తుంది. చూసిన ప్రేక్షకులందరూ మురిసిపోతారు’ అని చెప్పాడు. ఇది మన రూట్ కల్చర్‌లో ఉన్న కథ ఇదని, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుందని నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అన్నారు.
