వెల్లుల్లి కల్లంలో సీసీ కెమెరాలు, హై సెక్కూరిటీ

వెల్లుల్లి కల్లంలో సీసీ కెమెరాలు, హై సెక్కూరిటీ

ఇటీవల కాలంలో  చోరీలు ఎక్కువైతుండటంతో  రోడ్లు, దేవాలయాలు, దుకాణాలు, ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే విలువైన వస్తువులు ఏవైన సరే వాటికి రక్షణ పక్కా. అందుకే వినూత్నంగా ఆలోచించిన మధ్యప్రదేశ్ రైతులు కూడా వారి పంటకు సీసీ కెమెరాల నిఘా పెట్టారు. మధ్యప్రదేశ్ లో వెల్లులు ధర చుక్కల్లోకి ఎక్కింది. కేజీ రూ.500 పలుకుతుంది.  దీంతో మధ్య ప్రదేశ్ లోని ఛింద్వాడా జిల్లాలోని రైతులు వెల్లుల్లీ ని సాగు చేసిన తమ పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గజనాన్, రాహుల్  లు తమ పొలంలో వెల్లుల్లిసాగు చేస్తున్నారు. కొన్నిరోజులుగా వెల్లూల్లీ చోరీకి గురౌతున్నట్లు వీరు గమనించారు. పంట సాగు చేశాక, కుప్పల దగ్గర నుంచి రాత్రికి రాత్రే పంట మాయమౌతున్నాయి. దీంతో ఒక ప్లాన్ వేశారు.

పొలంలో సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా.. పొలంలోకి పనికి వచ్చిన కూలీలను చెక్ చేయడానికి సెక్యురిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పొలంలో ఎవరు కూడా చోరీకి పాల్పడే అవకాశం  లేకుండా ఇలా ఐడియా వేశారు. కొన్నిరోజులుగా వీరి చుట్టుపక్కల గ్రామాలలో వెల్లుల్లీ కుప్పలు చోరీ జరిగాయని సమాచారం. వేలాది రూపాయల డబ్బులు ఖర్చులు పెట్టి, కష్టపడి సాగు చేశాక.. చేతికొచ్చిన పంట దొంగల పాలు కావడంతో రైతులు ఆందోళన చెంది ఇలా హై సెక్కూరిటీ ఏర్పాటు చేశారు.