గరుడ గంగా పుష్కరాలు షురూ

గరుడ గంగా పుష్కరాలు షురూ
  • గరుడ గంగా పుష్కరాలు షురూ
  • పేరూరు వద్ద ప్రారంభించిన మాధవానంద సరస్వతి స్వామి
  • భారీగా తరలివచ్చిన భక్తులు

మెదక్, వెలుగు: మెదక్ మండలం పేరూరు వద్ద  శనివారం గరుడ గంగా పుష్కరాలు ఘనంగా  షురువయ్యాయి. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి   మాధవానంద సరస్వతి స్వామి మంజీరా నది వద్ద ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి దంపతులు పుష్కర స్నానం చేశారు. పుష్కరాల సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి ఆలయంలో సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకుడు దోర్బల రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో మంజునాథుడికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి మంజీరా నదిలో పుష్కర స్నానాలు చేసి నది ఒడ్డున కొలువైన సరస్వతి దేవిని దర్శించుకున్నారు. .