తిరుమలలో గరుడపంచమి వేడుకలు... బలమైన సంతానం కలగాలని పూజలు

తిరుమలలో గరుడపంచమి వేడుకలు... బలమైన సంతానం కలగాలని పూజలు

తిరుమ‌ల‌లో  సోమవారం ( ఆగస్టు 210 గరుడ పంచమి  వైభవంగా జరిగింది.   రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇచ్చారు . శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు .  నూతన దంపతులు తమ వైవాహిక జీవితం బాగుండాలని, పుట్టే సంతానం గరుడు లాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండాలని మొక్కులు పూజలు చేయడం గరుడపంచమిపూజ ప్రాశస్త్యం. దీంతో పెద్ద ఎత్తున భక్తులు గరుడ పంచమి రోజు తిరు వీధుల్లో ఊరేగే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకున్నారు. 

నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడ పంచమి.ఈ రోజున  మహిళలు స్నానానంతరం ముగ్గులు పెట్టి పీటపై అరిటాకులు పరచి బియ్యము పోసి వారి శక్తి మేరకు బంగారం వెండి ప్రతిష్టించి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెడతారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎస్ఈ  జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు  హరీంద్రనాథ్,  రాజేంద్ర, పేష్కార్  శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.