గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడానికి కారణాలు ఇవే.. మీరు ఇలా చేయద్దు..

గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడానికి కారణాలు ఇవే..  మీరు ఇలా చేయద్దు..

ఇండ్లలో తరచూ గ్యాస్ సిలిండర్లు పేలుతూ ఉండే వార్తలు చూస్తుంటాం..చదువుతుంటాం. ఈ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అయితే నిజానికి గ్యాస్ సిలిండర్లు పేలడానికి మనం చేసే చిన్న చిన్న తప్పిదాలే కారణం. 

గ్యాస్ సిలిండర్ లో మంటలు చెలరేగడానికి కారణాలివే..

  • మన ఇళ్లల్లో వాడే గ్యాస్ సిలిండర్ కు కమర్షియల్ సిలిండర్ రెగ్యులేటర్ అమర్చొద్దు. ఇలా చేయడం వల్ల కూడా గ్యాస్ సిలిండర్లో మంటలు చెలరేగుతాయి. 
  • కమర్షియల్ సిలిండర్ రెగ్యులేటర్ ను.. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కు అమర్చితే ఒత్తిడి ఎక్కువ అయ్యి గ్యాస్ బయటకు రావడంతో మంటలు చెలరేగుతాయి. 
  • గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయితే నిర్లక్ష్యంగా వదిలేయొద్దు. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి..సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే గ్యాస్ సిబ్బంది చేత బాగు చేయించుకోవాలి. లేదంటే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 
  • తరచూ స్టవ్ ను నీటితో కడగకూడదు. గ్యాస్ సిలిండర్ నుంచి స్టవ్ కు గ్యాస్ సరఫరా చేసే పైప్ నాణ్యమైనది వాడాలి.  

బషీర్బాగ్ లోని దోమలగూడలో 2023 జులై 11 మంగళవారం  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా ఇళ్లంతా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. వెంటనే క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.  ప్రమాదం జరగడంతో  ఇంట్లో సమాన్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.