బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి ..ఒకరు మృతి..ఆరుగురికి గాయాలు

 బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి ..ఒకరు మృతి..ఆరుగురికి గాయాలు

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. బిఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా...ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. 

ఏమైందంటే..

కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ సమ్మేళనానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ జన సమీకరణ చేసింది. పక్కనే వంటలు చేస్తున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పటాకులు పేల్చారు. కొన్ని నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ పై పడటంతో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. 

విమర్శలు..

ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదం జరగడంపై బాధిత కుటుంబ సభ్యులు  దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై మండిపడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో కనీస భద్రతా చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనంపై ఉన్న దృష్టి..కార్యకర్తల భద్రతపై లేదా అని ప్రశ్నిస్తున్నారు.