వైజాగ్ HPCLలో గ్యాస్ లీకేజీ కలకలం

వైజాగ్ HPCLలో గ్యాస్ లీకేజీ కలకలం

విశాఖపట్టణం: స్థానిక హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL) పరిశ్రమలో గ్యాస్ లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. గ్యాస్ లీకవుతున్నట్లు సైరన్ మోగడంతో కార్మికులు  ప్రాణభయంతో ఫ్యాక్టరీ బయటికి పరుగులు తీశారు. చుట్టుపక్క ప్రాంతాలకు క్షణాల్లో పాకడంతో పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి లీకేజీని అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. లీకేజీ మరమ్మత్తు పూర్తయి కొద్దిసేపట్లోనే అదుపులోకి రావడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. లీకేజీ కలకలం సద్దుమణిగాక కార్మికులు యధావిధిగా విధులకు హాజరయ్యారని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని యాజమాన్యం ప్రకటించింది.