అక్టోబర్‌‌‌‌ నుంచి గ్యాస్ రేట్లు పెరుగుతయ్‌‌!

అక్టోబర్‌‌‌‌ నుంచి గ్యాస్ రేట్లు పెరుగుతయ్‌‌!

న్యూఢిల్లీ: వంట గ్యాస్‌‌ (పీఎన్‌‌జీ) , సీఎన్‌‌జీ ధరలు   అక్టోబర్ నుంచి 10–11 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేచురల్‌‌ గ్యాస్ ధరలు 76 శాతం పెరగడంతో వీటి ధరలు  పెరగొచ్చు. ఓఎన్‌‌జీసీ వంటి కంపెనీలు సేకరించిన నేచురల్ గ్యాస్ ధరలను ప్రభుత్వం ప్రతీ 6 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తోంది. తర్వాత రివ్యూ అక్టోబర్ 1 న ఉంది. అడ్మినిస్ట్రేటెడ్​ సింగ్‌‌ మెకానిజం (ఏపీఎం) ప్రకారం నేచురల్ గ్యాస్ ధర ఒక మిలియన్ బ్రిటిష్‌‌ థర్మల్ యూనిట్‌‌ (ఎంఎంబీటీయూ) కి 3.15 డాలర్ల చొప్పున పెంచుతారని  అంచనా. ప్రస్తుతం ఈ రేటు 1.79 డాలర్లు. రాబోయే రివ్యూ మీటింగ్‌‌లో పెంచిన రేట్లు 2022, మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. కాగా, సీఎన్‌‌జీ, పీఎన్‌‌జీని నేచురల్ గ్యాస్‌‌ నుంచి సేకరిస్తారు. సీఎన్‌‌జీని ఆటోమొబైల్స్‌‌లో వాడుతున్నారు.