నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ‘96’ మరపురాని చిత్రం

నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ‘96’ మరపురాని చిత్రం

తమిళ, మలయాళ చిత్రాలతో  హీరోయిన్‌‌‌‌గా గుర్తింపు తెచ్చుకున్న గౌరి కిషన్.. ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సంతోష్ శోభన్ హీరోగా, ప్రశాంత్ కిశోర్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం శనివారం రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా గౌరి కిషన్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ‘96’ మరపురాని చిత్రం. అదే పాత్రను తెలుగులో ‘జాను’లో కూడా పోషించా. ‘శ్రీదేవి శోభన్ బాబు’ నా ఫస్ట్ కమర్షియల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. పల్లెటూరికి వెళ్లే హైదరాబాదీ అమ్మాయిలా కనిపిస్తా. నా తండ్రిగా నాగబాబు నటించారు. నిజజీవితంలో నాన్నకు ఎంత దగ్గరగా ఉంటానో సినిమాలో నేను ఆయనకు అంతే దగ్గరగా ఉంటాను. సంతోష్ చాలా మంచి నటుడు. నేను అతన్ని టాలీవుడ్ ఆయుష్మాన్ ఖురానా అని పిలుస్తాను. ప్రశాంత్ ఫెంటాస్టిక్ స్టోరీ టెల్లర్. కథను అర్ధవంతంగా ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేలా తెరకెక్కించారు. సుష్మిత అక్క నిర్మాతగానే కాక,  ఫ్యాషన్ డిజైనర్ కావడంతో  కాస్ట్యూమ్స్‌‌‌‌పై స్పెషల్ ఫోకస్ పెట్టేవారు. ‘జాను’ తరహాలోనే ఈ చిత్రంతోనూ నాకు మంచి అప్లాజ్‌‌‌‌తో పాటు మరిన్ని ఆఫర్స్ వస్తాయని నమ్ముతున్నా’ అని  చెప్పింది.