అసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ గౌతమ్ అదానీ.. రెండో స్థానంలో ముకేశ్ అంబానీ

అసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ గౌతమ్ అదానీ.. రెండో స్థానంలో ముకేశ్ అంబానీ

న్యూఢిల్లీ:  అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. రిలయన్స్ చైర్మన్ ముకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబానీ (సంపద 88 బిలియన్ డాలర్లు), సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (87 బిలియన్ డాలర్ల) లను వెనక్కి నెట్టి ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్  రియల్ టైమ్ బిలియనీర్ల తాజా జాబితా ప్రకారం.. ప్రస్తుతం అదానీ నికర ఆస్తి విలువ 89.2 బిలియన్ డాలర్లుగా ఉంది.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన 23వ స్థానంలో నిలిచారు.  ఈ ఏడాది మేలో  అదానీపై  అమెరికాలో కొనసాగిన విచారణలు ముగియడంతో గ్రూప్ షేర్లు భారీగా పెరిగాయి. గత రెండు వారాల్లోనే అదానీ వ్యక్తిగత సంపద 10 బిలియన్ డాలర్లు పెరగ్గా, ఈ వారంలో ఒకే రోజున 2.5 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లు ఎగిసింది.