IND vs ENG 2025: ఐదో టెస్ట్‌లో బుమ్రా ఆడతాడా.. గంభీర్ సమాధానమిదే!

IND vs ENG 2025: ఐదో టెస్ట్‌లో బుమ్రా ఆడతాడా.. గంభీర్ సమాధానమిదే!

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐదో టెస్ట్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ సిరీస్ కు ముందు పని భారం కారణంగా మూడు టెస్టులో ఆడగలను అని తెలియజేసిన బుమ్రా..తొలి నాలుగు టెస్టుల్లో మూడు ఆడేశాడు. నాలుగు టెస్టుల్లో భాగంగా లీడ్స్, లార్డ్స్, మాంచెస్టర్ టెస్టులో ఆడాడు. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ కు దూరమయ్యాడు. దీంతో బుమ్రా ఐదో టెస్ట్ లో ఆడడం దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తోంది. ఒకవేళ బుమ్రా చివరి టెస్టులో ఆడకపోతే టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారుతుంది. అదే జరిగితే ఇప్పటికే 1-2 తో వెనకబడిన టీమిండియా చివరి మ్యాచ్ ఓటమితో సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.

ఓవల్ వేదికగా బుమ్రా చివరి టెస్ట్ ఆడతాడో లేదో అనే విషయంపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ స్పందించాడు. గంభీర్ బుమ్రా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నాలుగో టెస్ట్ ముగిసిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. "ఫాస్ట్ బౌలర్లందరూ ఫిట్‌గా ఉన్నారు. గాయాల గురించి ఎటువంటి సందేహాలు లేవు. చివరి టెస్ట్ కోసం కాంబినేషన్ గురించి మేము ఎటువంటి సంభాషణ చేయలేదు. జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అంతిమంగా ఎవరు ఆడినా జట్టు విజయం కోసం ప్రయత్నిస్తారు"  అని గంభీర్ అన్నాడు.

Also Read:-ఇంగ్లాండ్ పేసర్ బాల్ టాంపరింగ్..కెమెరాకు అడ్డంగా దొరికిన కార్స్

ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రా ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడాడు. లీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెస్ట్ తీసుకోగా.. అక్కడ సిరాజ్, ఆకాశ్ దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అద్భుతంగా రాణించి ఇండియాకు విజయాన్ని అందించారు. లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో టెస్టుకు తిరిగి వచ్చిన బుమ్రా 43 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ముగిసిన మాంచెస్టర్ టెస్టులో 33 ఓవర్లలో 112 పరుగులు సమర్పించుకున్న బుమ్రా ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో తొలిసారి 100 పరుగులు పైగా ఇచ్చాడు. ఇప్పటివరకు టెస్ట్ కెరీర్ లో 47 టెస్టులాడిన బుమ్రా.. 100కి పైగా పరుగులివ్వడం ఇదే తొలిసారి. ఓవరాల్ గా 33 ఓవర్లలో 112 పరుగులు ఇచ్చి జెమీ స్మిత్, డాసన్ వికెట్లు తీసుకున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ESPNcricinfo (@espncricinfo)