Gautam Gambhir: కావాలంటే నన్ను ట్రోల్ చేయండి.. 23 ఏళ్ళ కుర్రాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?: నెటిజన్స్‌పై గంభీర్ ఫైర్

Gautam Gambhir: కావాలంటే నన్ను ట్రోల్ చేయండి.. 23 ఏళ్ళ కుర్రాడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?: నెటిజన్స్‌పై గంభీర్ ఫైర్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాపై కొన్ని రోజులుగా విపరీతమైన ట్రోలింగ్ వస్తుంది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కు హర్షిత్ రానా ఎంపికైన దగ్గర నుంచి వ్యక్తిగతంగా నెటిజన్స్ ఈ టీమిండియా పేసర్ ను టార్గెట్ చేస్తున్నారు. జట్టులో ఎంపికవ్వడం తన తప్పు కాకపోయినా రానాపై ఈ రేంజ్ లో విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హర్షిత్ ను కావాలనే భారత జట్టుకు ఎంపిక చేస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. గంభీర్ సపోర్ట్ కారణంగా ఈ కేకేఆర్ బౌలర్ జట్టులో కొనసాగుతున్నాడని చాలామంది పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారు. 

హర్షిత్ రానాపై వస్తున్న ట్రోలింగ్ పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విరుచుకుపడ్డాడు. వెస్టిండీస్ తో ముగిసిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ.. రానాను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే నెటిజన్స్ పై ఫైరయ్యాడు. " మీ అభిప్రాయాల కోసం 23 ఏళ్ల వ్యక్తిని టార్గెట్ చేయడం సిగ్గుచేటు. అతని తండ్రి మాజీ సెలెక్టర్ చైర్మన్ కాదు అదే విధంగా ఎన్నారై కాదు. కావాలంటే మీరు నన్ను ట్రోల్ చేయండి.. హ్యాండిల్ చేయగలుగుతాను. మీరు అతడి ప్రదర్శన బాగా లేకపోతే టార్గెట్ చేసుకోవచ్చు. అంతేకానీ అతను చేయని తప్పుకు ఎందుకు నిందించడం కరెక్ట్ కాదు". అని గంభీర్ నెటిజన్స్ పై ఫైరయ్యాడు. 

ఏడాది కాలంగా టీమిండియాలో మూడు ఫార్మాట్ లలో హర్షిత్ రానా ఆడుతున్నాడు. ప్లేయింగ్ 11 లో స్థానం సంపాదించుకున్నా స్క్వాడ్ లో మాత్రం ఎంపికవుతున్నాడు. ఆస్ట్రేలియాపై జరగబోయే వన్డే, టీ20 స్క్వాడ్ లోనూ హర్షిత్ ఉన్నాడు. అయితే హర్షిత్ రానాకు వరుసగా  ఛాన్స్ ఇవ్వడం కొంతమందికి నచ్చడం లేదు. దీంతో హర్షిత్ పై దారుణంగా ట్రోలింగ్ నడించింది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటున్న గంభీర్ ఐపీఎల్ 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్. మరోవైపు హర్షిత్ కూడా కేకేఆర్ జట్టు తరపున బాగా ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. కేకేఆర్ తో ఉన్న అనుబంధం కారణంగానే ఆ జట్టులోని రానాకు గంభీర్ వరుస అవకాశాలు ఇస్తున్నాడని నెటిజన్స్ భావించారు.