IND vs ENG 2025: మా విషయాల్లో జోక్యం మీకు అనవసరం: పిచ్ క్యూరేటర్‌కు వేలు చూపించి మాట్లాడిన గంభీర్

IND vs ENG 2025: మా విషయాల్లో జోక్యం మీకు అనవసరం: పిచ్ క్యూరేటర్‌కు వేలు చూపించి మాట్లాడిన గంభీర్

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా చివరి టెస్ట్ గురువారం (జూలై 31) జరగనుంది. లండన్ లోని ఓవల్ గ్రౌండ్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ప్రస్తుతం 4 టెస్ట్ మ్యాచ్ లు జరగగా ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. మరోవైపు ఇండియా విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే 2-1 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకుంటుంది. ఈ టెస్టుకు రెండు రోజులు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కియా ఓవల్ మైదానం చీఫ్ క్యూరేటర్‌తో వాగ్వాదానికి దిగాడు.

జూలై 31న ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌కు ముందు టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ క్యూరేటర్‌తో గొడవకు దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో గంభీర్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌పై అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. వివారాల్లోకెళ్తే.. ఐదో టెస్టు కోసం భారత జట్టు తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా మారింది. కోచ్ గంభీర్ భారత ఆటగాళ్లను పర్యవేక్షిస్తూ కనిపించాడు. భారత జట్టు ప్రాక్టీస్ వద్దకు పిచ్ క్యూరేటర్ కూడా కనిపించాడు. భారత స్టాఫ్ తో పిచ్ క్యూరేటర్ ఫోర్టిస్ మాట్లాడడం గంభీర్ కు నచ్చలేదు. 

ఫోర్టిస్ వైపు వేలు చూపించి మాట్లాడుతూ.. "మేము ఏమి చేయాలో మీరు మాకు చెప్పనవసరం లేదు". అంటూ మాట్లాడాడు. క్యూరేటర్ లీ ఫోర్టిస్‌ ఏం మాట్లాడాడో గంభీర్ ఎందుకు అసంతృప్తిగా కనిపించాడో తెలియాల్సి ఉంది. చివరి టెస్టులో ఇంగ్లాండ్ ఎలాగైనా గెలిచి సిరీస్ ను 3-1 తేడాతో గెలవాలని చూస్తోంది. ఓవల్ పిచ్ ఎలా ఉంటుందో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదు. సహజంగా ఫాస్ట్ బౌలర్లను అనుకూలించే పిచ్ ఈ సారి స్లో గా వుండబోతుందనే టాక్. టీమిండియా 2-2 తో సిరీస్ సమం చేస్తుందో లేకపోతే 1-3 తో ఇంగ్లాండ్ కు సిరీస్ కోల్పోతుందో చూడాలి.