
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా..? లేదా..?. ప్రస్తుతం వన్డే క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒక ఫార్మాట్ లో ఆడడంతో అప్పటివరకు రోకో జోడీ ఫిట్ నెస్, ఫామ్ తో ఉంటారా అనేది ప్రస్నార్ధకంగా మారింది. దిగ్గజాలు సైతం వీరిద్దరూ వన్దే వరల్డ్ కప్ ఆడడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అగార్కర్ కూడా కోహ్లీ, రోహిత్ లకు వరల్డ్ కప్ లో చోటు గ్యారంటీ లేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
రోహిత్, కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే విషయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ తో మాట్లాడిన గంభీర్ ఇలా అన్నాడు.. "2027 ప్రపంచ కప్ కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం ఏం జరుగుతుందో ఆలోచించాలి. వర్తమానంలో ఉండటం ముఖ్యం. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్ళు. ఆస్ట్రేలియాలో వారి పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను". అని మంగళవారం (అక్టోబర్ 14) గంభీర్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నాడు.
గంభీర్ కూడా రోకో జోడీ జట్టులో ఉంటుందని క్లారిటీ ఇవ్వలేకపోయాడు. గంభీర్ మాటలను బట్టి చూస్తుంటే రోహిత్, కోహ్లీ ఎప్పటివరకు ఆడతారో ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. దీంతో మళ్ళీ సస్పెన్స్ మొదలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్నారు. టీ20, టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోకో జోడీ.. వన్డే క్రికెట్ లో మాత్రమే కొనసాగడానికి కారణం లేకపోలేదు. సౌతాఫ్రికా వేదికగా 2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ఆడాలని రోహిత్, కోహ్లీ నిర్ణయించుకున్నారు. వన్డే వరల్డ్ కప్ ఆడడంపై వీరు అనేక సందర్భాల్లో తమ ఆసక్తిని తెలిపారు.
వరల్డ్ కప్ కు మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడడంతో వారి ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. వీరిద్దరూ ఆ సమయానికి ఫిట్ నెస్ తో పాటు ఫామ్ లో ఉంటారంటే ఖచ్చితంగా చెప్పాలని పరిస్థితి. టెస్ట్ క్రికెట్ లో పేలవ ఫామ్ కారణంగానే ఈ ఇద్దరూ సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక్క ఫార్మాట్ ఆడడంతో వీరి ఫామ్ ప్రస్నార్ధకంగా మారింది. బీసీసీఐ కూడా రోహిత్, కోహ్లీ జోడీ ఖచ్చితంగా జట్టులో ఉంటారనే గ్యారంటీ ఇవ్వలేకపోతుంది. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు లేకపోయినా ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా అద్భుతంగా ఆడి 2-2 తో సమం చేసుకుంది.