
లోక్ సభ బరిలో నిలిచిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ గెలిచారు. బీజేపీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ నుంచి MP స్థానానికి పోటీ చేసిన ఆయన మూడు లక్షల తొంబై వేల మూడువందల తొంబై ఒక్క ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గంభీర్ కు ఆరు లక్షల తొంబై ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత అరవింద్ సింగ్ రెండవ స్థానంలో నిలవగా..ఆప్ అభ్యర్థి అతిషి మూడవ స్థానం వచ్చింది.
విజయం సాధించిన తర్వాత గంభీర్ మీడియాతో మాట్లాడారు. తన గెలుపుకు సహాకరించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. గంభీర్ విజయం సాధించడంతో టీం ఇండియా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మన్ అభినందనలు తెలిపారు. వీరితో పాటు భారత స్పిన్నర్ హర్ భజన్ కూడా గంబీర్ కు విషెస్ తెలియచేశారు.