ప్రజలే నా పార్టీ పేరు, జెండా నిర్ణయిస్తారు

ప్రజలే నా పార్టీ పేరు, జెండా నిర్ణయిస్తారు

గులాం నబీ ఆజాద్ కొత్త పొలిటికల్ జర్నీ ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ లోని సైనిక్ ఫామ్స్ లో  ర్యాలీ నిర్వహించారు. ఇందులో భారీగా ఆయన మద్దతుదారులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చారు. తన పార్టీకి ఇంకా పేరు నిర్ణయించలేదన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలే పార్టీ పేరు, జెండాను నిర్ణయిస్తారని తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా తన పార్టీకి హిందూస్థానీ పేరు పెడతానన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆజాద్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తన రక్తాన్ని ధారపోశానన్నారు.  

తాను జమ్మూ కశ్మీర్ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.  ఆజాద్ నేతృత్వంలో ఏర్పడే కొత్త పార్టీ పీడీపీ లేదా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉంది. బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోబోమని ఆజాద్ స్పష్టం చేశారు.