బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఇండియా యంగ్ షట్లర్లు పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. గురువారం జరిగిన విమెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి–ట్రీసా జంట 21–10, 21–12తో ఇండియాకే చెందిన ప్రియ–శ్రుతి జోడీని ఓడించింది. మరో మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో 17–21, 16–21తో రుయి హిరోకమి–యునా కటో (జపాన్) చేతిలో పరాజయం పాలైంది.
