అబ్బాయిపాలెంలో ఈత చెట్టుపైనుంచి జారిపడి గీత కార్మికుడు మృతి

అబ్బాయిపాలెంలో  ఈత చెట్టుపైనుంచి జారిపడి గీత కార్మికుడు మృతి
  •     మహబూబాబాద్ జిల్లా అబ్బాయిపాలెంలో ఘటన

మరిపెడ, వెలుగు : ప్రమాదవశాత్తు ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. టూటౌన్ ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపిన ప్రకారం.. మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షుడు పోగుల సత్యం(60), రోజు మాదిరిగానే ఆదివారం కల్లు గీసేందుకు ఈత చెట్టు ఎక్కుతుండగా అదుపుతప్పి జారి కిందపడ్డాడు. 

తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.​ మృతుడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సత్యం మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు