
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం యూనివర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న టెక్ ఫెస్ట్ జోనల్స్ 2025 సోమవారం విజయవంతంగా ముగిసింది. ఐఐటీ బాంబే సహకారంతో ఆసియాలోనే అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ జోనల్స్‌కు గీతం ఈఈసీఈ విభాగం, జీ ఎలక్ర్టా ప్రాతినిథ్యం వహించాయి. వివిధ విభాగాల్లో విద్యార్థులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించారు.
కోడ్ కోడ్, మెష్ మెరైజ్, కోజ్మో క్లెంచ్, టీఎఫ్‌వో లాంటి నాలుగు ఎడిషన్లలో విద్యార్థులు తమ నైపుణ్యాలను జాతీయ వేదికకు అందించారు. గీతంకు చెందిన ఆరుగురు ప్రొఫెసర్లు, 40 మంది స్టూడెంట్ వలంటీర్లు మరో ఇద్దరు టెక్నాలజీ ప్రొఫెషనర్ల సమన్వయంతో దాదాపు 400 మంది విద్యార్థులు ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ వీఆర్శాస్ర్తీ, ఈఈసీఈ హెడ్ ప్రొఫసర్ మాధవీలత, నరేశ్ కుమార్, బాలాజీ, గౌరీశంకర్, వేణు రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.