హుజురాబాద్ TRS క్యాండిడేట్ గా గెల్లు శ్రీనివాస్!

V6 Velugu Posted on Aug 03, 2021

హుజురాబాద్ TRS క్యాండిడేట్ పై CM KCR ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ అభ్యర్థినే బరిలో దింపాలని డిసైడ్ అయినట్లు సమాచారం. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తర్వాతే అభ్యర్థిని కన్ఫామ్ చేసినట్లు టాక్. CM KCR లిస్టులో చాలామంది పేర్లు ఉన్నట్లు వినబడ్డా.. TRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కే టికెట్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. గెల్లు శ్రీనివాస్ తో పాటు.. ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన స్వర్గం రవి, జమ్మికుంట స్థానిక లీడర్ వీరేశం, వకుళాభరణం కృష్ణమోహన్ పేర్లు పరిశీలించినా.. గెల్లుకే ఇవ్వాలని సీఎం కేసీఆర్ డిసైడ్ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tagged TRS candidate, Huzurabad, Gellu Srinivas

Latest Videos

Subscribe Now

More News