ఏఐ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌ ‘జీన్​ కనెక్ట్’ ప్రారంభం

ఏఐ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌ ‘జీన్​ కనెక్ట్’ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు :  నెక్ట్స్​జీన్ ​​సీక్వెన్సింగ్​ ద్వారా రోగికి పర్సనలైజ్డ్​ కేర్​ అందించే 'జెనీ కనెక్ట్ ఆర్ఎక్స్' ను ఏఐజీ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్, చీఫ్ డాక్టర్   నాగేశ్వర్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో శుక్రవారం ప్రారంభించారు. ఇది ఉప్పలూరి గ్రూప్‌‌‌‌‌‌‌‌లో భాగమైన డయాగ్నస్టిక్ వింగ్ జీన్​పవర్​ ఆర్ఎక్స్ లో ఒక వినూత్న ఏఐ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో పర్సనలైజ్డ్ మెడిసిన్ తప్పనిసరిగా ఉండాలన్నారు.

ప్రతి ఒక్కరికీ కచ్చితమైన, సమర్థవంతమైన, సరసమైన పర్సనలైజ్డ్ డ్రగ్స్​ను అందించడం అనేది కీలకం అన్నారు.  జెనీ కనెక్ట్ ఆర్ఎక్స్ వల్ల భవిష్యత్​లో వచ్చే వ్యాధులను ముందే గుర్తించే అవకాశం ఉంది. ప్రస్తుత వ్యాధుల చికిత్సకు అనువైన ఆహారాన్ని, వ్యాయామాన్ని, మందులను సూచిస్తారు. సైడ్​ఎఫెక్ట్స్​ను గుర్తిస్తారు.