ఎలక్షన్స్ హెల్ప్ డెస్కు లను సమర్థవంతంగా నిర్వహించాలి : సర్వేశ్వర్ రెడ్డి

 ఎలక్షన్స్ హెల్ప్ డెస్కు లను సమర్థవంతంగా నిర్వహించాలి : సర్వేశ్వర్ రెడ్డి
  • ఎన్నికల సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్​ రెడ్డి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన హెల్ప్​ డెస్కులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్​ డైరెక్టర్​ సర్వేశ్వర్​ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని భద్రాచలం, బూర్గంపహాడ్​ మండలాల్లో గురువారం ఆయన పర్యటించారు. నామినేషన్​ పత్రాల దాఖలును పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నామినేషన్​ వేసే అభ్యర్థులకు అందుబాటులో ఉంటూ సిబ్బంది అవసరమైన సాయం అందించాలన్నారు. 

అభ్యర్థులకు అవసరమైన సమాచారం అందించడంలో హెల్ప్​ డెస్కుల పాత్ర ప్రధానమైనదని చెప్పారు.  అశ్వాపురం మండలంలోని పలు గ్రామపంచాయతీలలో జరుగుతున్న నామినేషన్​ ప్రక్రియను వ్యయ పరిశీలకురాలు లావణ్య పరిశీలించారు. నామినేషన్ల స్వీకరించే విధానాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు ఖర్చులను ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రకారంగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు ఆఫీసర్లు ఇవ్వాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా ఓపెన్​ చేయాలని చెప్పారు.