బీమా ప్రీమియంలో 102 శాతం వృద్ధి..జెనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటన

బీమా ప్రీమియంలో 102 శాతం వృద్ధి..జెనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: జెనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్  2026 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత కొత్త వ్యాపార ప్రీమియంలో 102 శాతం వృద్ధి సాధించింది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.476 కోట్ల నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.964 కోట్లకు చేరింది. కంపెనీ క్లెయిమ్ సెటిల్‌‌మెంట్ రేషియో 99.57 శాతంగా నమోదైంది.  కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎమ్) 19 శాతం వృద్ధితో రూ.10,470 కోట్లకు చేరాయి. గ్రాస్​ రిటెన్​ ప్రీమియం 16 శాతం పెరిగింది.