కాంటినెంటల్ ఆటోసప్లియర్స్ కంపెనీలో 7 వేల మంది తొలగింపు

కాంటినెంటల్ ఆటోసప్లియర్స్ కంపెనీలో 7 వేల మంది తొలగింపు

జర్మన్ ఆటో సప్లియర్స్ కాంటినెంటల్ కంపెనీ లేఆఫ్స్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తన కంపెనీ ఉద్యోగుల్లో 7,150 మందిని తొలగించేందుకు సిద్ధమైంది. 2025 నాటికి ఈ లేఆఫ్స్ ఉంటాయని బుధవారం (ఫిబ్రవరి 14) తెలిపింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 3.6 శాతం.ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ రంగాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ ఆటో యూనిట్ ఈ రంగంలోని కంపెనీలను రీటూల్ చేయడానికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 

ఆటోమేకర్లకు టైర్లు, కాంపోనెంట్స్ ను తయారు చేసి గ్రూప్.. కాంటెనెంటల్.. రీసెర్ట్ అండ్ డెవలప్ మెంట్ లో 1,750మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. 2025 నాటికి ఈ కంపెనీ 400 మిలియన్ యూరో ఆదా చేయాలనే లక్ష్యంతో గతంలో ప్రకటించిన విధంగా ఖర్చు తగ్గించే కార్యక్రమంలో భాగంగా ఇది 5,500 ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న కాంటినెంటల్ ఉద్యోగుల తొలగింపుపై గత నవంబర్ లో షెడ్యూల్ ప్రకటించింది. అయితే తొలగించిన ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం పడకుండా తగిన పరిష్కారం చూపుతామని కంపెనీ వర్గాలు తెలిపాయి.