
Gold Reservoir: బంగారం ప్రస్తుతం భూమిపైన ఎక్కువగా ప్రజాధరణ పొందుతున్న లోహం. తరతరాల నుంచి దశాబ్ధాల నుంచి దీనికి భూమిపై అత్యంత గౌరవం, ప్రధాన్యత లభిస్తూనే వస్తోంది. దీనిని శాస్త్రవేత్తలు ల్యాబ్ లో తయారు చేయాలని ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. ప్రజలు కష్టకాలంలో తమ సంపదను కాపాడుకోవటానికి కూడా దీనిపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారని మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం కేవలం భూమిలో దొరికే ఈ అరుదైన ఖనిజం మన ఊహలకు అందనంత తయారవుతోంది.
వాస్తవానికి భూమి లోపలి పొరల్లో బంగారం ఎక్కువగా తయారు అవుతుంటుంది. దీనిపై జర్మనీలోని గొట్టింగెన్ యూనివర్సిటీ జియోకెమిస్ట్ నిల్స్ మెస్లింగ్ ఆసక్తికరమైన విషయాన్ని తమ పరిశోధనల్లో కనుక్కున్నట్లు పేర్కొన్నారు. భూమి పొరల్లోని లిథోస్పియర్ కింద అగ్నిపర్వతాలపై జరిపిన పరిశోధనల్లో బంగారం సహా ఇతర విలువైన లోహాలను కనుక్కున్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇవి భూమి కోర్ ప్రాంతం నుంచి మాంటిల్లోకి లీక్ అయ్యాయని పరిశోధనల్లో నిర్థారించబడిందని వెల్లడించారు.
మెుదటి ఫలితాలు వచ్చినప్పుడు బంగారాన్ని చూసి ఆశ్చర్యానికి గురైనట్లు సదరు శాస్త్రవేత్త వెల్లడించారు. అయితే ఇది మన భూమిపై ఉన్న మెుత్తం బంగారం కంటే తక్కువగా ఉన్నట్లు వారు అంటనా వేశారు. 99 శాతం బంగారం మెటాలిక్ కోర్ ప్రాంతంలో ఉందని.. ఇది మెుత్తం బయటకు వస్తే భూమిని 50 సెంటీమిటర్ల మందంతో కప్పవచ్చని వెల్లడించారు.
ప్రస్తుతం హవాయి ప్రాంతంలోని అగ్నిపర్వతాల నుంచి బయటకు వస్తున్న లావాలో రుథేరియం, బంగారం రావటంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది. కోర్-మాంటెల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతాల శిలల దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకంగా బంగారం పైకి ఉబికిరావటం శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోం ది. అయితే ఈ ప్రక్రియ అంతా మన కాలికింద ఉన్న భూమి పొరల్లో దాదాపు 3వేల కిలోమీటర్లకు కింద జరగుతోంది. 4.5 బిలియన్ సంవత్సరాల కిందట తయారైన భూమి కోర్ ప్రాంతం నుంచే 99.999 శాతం బంగారం, ఇతర విలువైన లోహాలు తయారవుతుంటాయి.