ఓటుకు అప్లయ్‌ చేసుకోండి :రజత్ కుమార్

ఓటుకు అప్లయ్‌ చేసుకోండి :రజత్ కుమార్
  •  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌
  •  ఓటరు జాబితాలో సవరణలకు షెడ్యూల్‌ రిలీజ్‌
  •  జనవరిలో ఓటరు తుది జాబితా 

హైదరాబాద్‌, వెలుగు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా 2020 జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు కోసం అప్లయ్‌ చేసుకోవాలని సీఈఓ రజత్‌ కుమార్‌ బుధవారం వెల్లడించారు. ఓటరు జాబితాలో ప్రత్యేక సవరణలు, మార్పులు కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసినట్టు చెప్పారు. ప్రస్తుతమున్న ఓటరు కార్డుల్లో తప్పులు, అభ్యంతరాలను నవంబర్‌ 30లోపు సరిచేసుకోవాలన్నారు.  బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఇంటికొచ్చినప్పుడు వివరాలు ఇస్తే సరిపోతుందన్నారు.

  • ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు ఫొటో క్వాలిటీ, ఓటరు జాబితాలో తప్పులు సరిచేసుకోవచ్చు. పాస్‌ పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌, రేషర్‌ కార్డుల్లో ఏదేని ఒక కార్డు ఉండాలి.
  • ఓటు వివరాలను ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
  • సెప్టెంబర్‌ 1 తేదీ నుంచి 30 వరకు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమాచారం సేకరిస్తారు. 
  • సెప్టెంబర్‌ 16వ తేదీ నుంచి అక్టోబర్‌15 వరకు పోలింగ్‌స్టేషన్లు గుర్తిస్తారు. 
  • బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు సేకరించిన సమాచారాన్ని డీఈఓలు, రోల్‌ అబ్జర్వర్లు పరిశీలిస్తారు. అనంతరం అప్రూవల్‌ కోసం కమిషన్‌కు పంపిస్తారు.
  • అక్టోబర్‌ 15న ఓటరు జాబితా ముసాయిదా ప్రదర్శిస్తారు.
  •  నవంబర్ 2,3, 9,10 తేదీల్లో ఓటరు నమోదుపై అవగాహన.
  • డిసెంబర్‌ 15లోగా వాదనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు.
  • డిసెంబర్‌ 25వ తేదీన మార్పులేమైనా ఉంటే సరిచేస్తారు.
  • కొత్త ఓటర్లను జాబితాలో చేర్చి పరిశీలనకు ఎలక్షన్‌ కమిషన్‌కు పంపిస్తారు.
  • జనవరి ఒకటవ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.