30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం తెలివితక్కువ పని

V6 Velugu Posted on Dec 31, 2020

ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూజా బేడీ గురించి తెలిసే ఉంటుంది. జో జీతా వహీ సికందర్, లూటెరే లాంటి పలు సినిమాలతో గ్లామరస్ హీరోయిన్‌‌గా గుర్తింపును సొంతం చేసుకుంది. పూజా కూతురు అలయా కూడా రీసెంట్‌‌గా బాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. పెళ్లి విషయంలో కూతురు అలయాకు పూజా బేడీ ఇచ్చిన ఓ సలహా హాట్ టాపిక్‌‌గా మారింది. 30 ఏళ్ల వయస్సు వచ్చే దాకా పెళ్లి చేసుకోవద్దని అలయాకు పూజా సూచించిందట. ఈ విషయాన్ని అలయా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘భారత్ లాంటి దేశంలో పెళ్లి విషయంలో పిల్లలపై పెద్దలు పదేపదే ఒత్తికి తీసుకొస్తారు. కానీ నా పేరెంట్స్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ముప్పయి ఏళ్ల లోపు పెళ్లి చేసుకుంటే దానికి మించిన తెలివితక్కువ పని మరొకటి ఉండదని వాళ్లు హెచ్చరిస్తుంటారు. కెరీర్, పని పై ఫోకస్ చేయాలని.. మనల్ని మనం మెరుగుపర్చుకోవడం మీదే దృష్టి సారించాలని సూచిస్తుంటారు’ అని అలయా సదరు ఇంటర్వ్యూలో పేర్కొంది.

Tagged alaya f, foolishness, under 30

Latest Videos

Subscribe Now

More News