అదనపు రుణం కోసం IMFతో శ్రీలంక చర్చలు

అదనపు రుణం కోసం IMFతో శ్రీలంక చర్చలు

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం అక్కడ ప్రజలు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. విదేశీ మారక నిల్వలు కొరత కారణంగా ఇంధనం, మందులతో సహా నిత్యావసరాలను దిగుమతి చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఆర్థిక, ఆహార సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక కొత్త ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే విదేశీ సహాయం కోరుతూ చైనా, భారత్‌, జపాన్‌లతో దాతాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఘే పేర్కొన్నారు. తమకు చారిత్రాత్మక మిత్రదేశాలుగా ఉ‍న్న ఈ దేశాల సాయంతోనే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అమెరికా నుంచి కూడా సాయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు అదనపు రుణం కోసం IMFతో చర్చలు జరుపుతామని చెప్పారు.