కాంగ్రెస్ లో చేరిన ఘనాపూర్ మాజీ సర్పంచ్​లు

కాంగ్రెస్ లో చేరిన ఘనాపూర్ మాజీ సర్పంచ్​లు

చేవెళ్ల, వెలుగు :  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్ కు చెందిన బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ పామెన భీంభరత్ ఆధ్వర్యంలో రేగడి ఘనాపూర్ కు చెందిన మాజీ సర్పంచులు తిప్పని రాంరెడ్డి, రాయికంటి నర్సింహులు, మాజీ ఉప సర్పంచులు  బాల్ రెడ్డి, యాదయ్య, స్కూల్ చైర్మన్ కిష్టయ్య, పాండులు కాంగ్రెస్ లో చేరారు.

వారికి ఎంపీ రంజిత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేగడి ఘనాపూర్ లో సమస్యలను పరిష్కారానికి  కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.  పీసీబీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, పీఏసీ ఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, దామర గిద్ద మాజీ సర్పంచ్ మధు సూదన్ గుప్తా, చేవెళ్ల కాంగ్రెస్ నేతలు పాటి దామోదర్ రెడ్డి, మండల కాంగ్రెస్​ఎస్సీ సెల్​ ప్రెసిడెంట్​ఈదుల పల్లి రాములు, నేతలు  సత్యనారాయణ రెడ్డి, షాబాద్ నర్సింహులు, మల్లారెడ్డి, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీర్జాగూడ మాజీ సర్పంచ్ భీమయ్య ఆధ్వర్యంలో బీఆర్ ఎస్ నేతలు ఆ పార్టీ కి రాజీనామా చేసిన కాంగ్రెస్ లో చేరారు.