ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఘటికాచలం'..ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఘటికాచలం'..ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు.  ఈ చిత్రానికి కథను అందిస్తూ  ఎం సి రాజు నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

ఇందులో రెండు డిఫరెంట్ లుక్స్‌‌లో కనిపిస్తున్నాడు నిఖిల్ దేవాదుల. ఓవైపు  ఇన్నోసెంట్‌‌గా కనిపిస్తుంటే, మరోవైపు రాక్షసుడి గెటప్‌‌లో ఇంటెన్స్‌‌ లుక్‌‌లో కనిపిస్తున్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

ఇదొక ఇంటెన్స్ సస్సెన్స్ థ్రిల్లర్.  ప్రభాకర్, ఆర్వికా గుప్తా,  జోగి నాయుడు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నామన్నారు దర్శక నిర్మాతలు.