ముహూర్త బలం : ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్న జంట : డెంగ్యూ సైతం ఆపలేకపోయింది

ముహూర్త బలం : ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్న జంట : డెంగ్యూ సైతం ఆపలేకపోయింది

ఇటీవలి కాలంలో దేశంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న క్రమంలో ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ వ్యాధి నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. దీని వల్ల కొన్నిసార్లు సమావేశాలు కూడా వాయిదా పడిన సందర్భాలున్నాయి. కానీ ఓ జంట ఒక్కటవడాన్ని మాత్రం డెంగ్యూ ఆపలేకపోయింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉన్నదనంగా.. వరుడు అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత అతనికి పరీక్షలు నిర్వహించగా.. డెంగ్యూ అని తేలింది. రోజులు గడిచాయి. కానీ పెళ్లి కొడుకు మాత్రం ఇంకా ఇంటికి రాకపోవడం, పెళ్లి మహూర్తం దగ్గర పడుతుండడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఫైనల్ అంతా కలిసి చర్చించి.. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిపించాలని నిశ్చయించుకున్నారు. ఆస్పత్రిలోనే వధూవరులు పూల మాలలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.

ఈ ఘటన ఘజియాబాద్‌లోని వైశాలిలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. డెంగ్యూ కారణంగా వరుడు హెల్త్‌కేర్‌లో చేరిన రెండు రోజుల తర్వాత నవంబర్ 27న ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఆసుపత్రి వార్డును వివాహ వేదికగా మార్చిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో, ఇద్దరూ సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో తమ ప్రత్యేక రోజును సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇలాంటి ఘటనే ఈ ఏడాది ప్రారంభంలో ఒక తెలంగాణ వ్యక్తి అనారోగ్యంతో ఉన్న మహిళను ఆసుపత్రిలోనే ప్రేమ వివాహం చేసుకున్నాడు. వధువు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకుంది. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించిన పెళ్లి తేదీలోనే వరుడు హెల్త్‌కేర్‌ను సందర్శించి, వారి వివాహానికి గుర్తుగా కొన్ని ఇతర ఆచారాలు నిర్వహించి.. ఆమె మెడపై మంగళసూత్రాన్ని కట్టాడు.