కెమికల్స్ తో మామిడి పండ్లు.. 4 లక్షల విలువైన పండ్లు సీజ్

కెమికల్స్ తో మామిడి పండ్లు.. 4 లక్షల విలువైన పండ్లు సీజ్

మార్కెట్లో  రంగు రంగుల్లో మెరిసిపోతున్న పండ్లను చూసి మోసపోవద్దంటున్నారు ఫుడ్ సేప్టీ ఆఫీసర్లు. మామిడి పండ్ల సీజన్ వస్తుండడంతో కెమికల్స్ తో కాయలను మగ్గబెడుతున్న ముఠాలు రంగంలోకి దిగాయి. దీంతో గ్రేట్ సిటీలో అలర్టయ్యారు అధికారులు. 

కెమికల్స్ కలిపి పండించిన 4 లక్షల విలువ చేసే మామిడి పండ్లను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్, GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు. కెమికల్స్ వేసి పండించడం ఆరోగ్యానికి మంచిది కాదన్నారు ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ దయోనిధి. కృతిమంగా మగ్గబెడుతున్న పండ్లుపై ప్రజలు అవగాహనతో ఉండాలన్నారు. కెమికల్స్ వేసి పండ్లను పండిస్తున్నట్లు తమకు సమాచారం ఇస్తే 48 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారు దయోనిధి.