V6 News

రూ.2 కోట్లతో GHMC క్రిస్మస్ వేడుకలు.. 150 డివిజన్లలోని చర్చిల్లో సెలబ్రేషన్స్

రూ.2 కోట్లతో GHMC క్రిస్మస్ వేడుకలు.. 150 డివిజన్లలోని చర్చిల్లో సెలబ్రేషన్స్
  • 1,750 చర్చిలకు పెయింట్​తో పాటు లైటింగ్ ఏర్పాటు
  • నిధుల కోసం 15లోపు దరఖాస్తు 

హైదరాబాదక సిటీ, వెలుగు: క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బల్దియా సిద్ధమైంది. గ్రేటర్ విలీన ప్రక్రియ ఇంకా కొనసాగుతుండడంతో ప్రస్తుతానికి రూ.2 కోట్లతో ఇదివరకు ఉన్న 150 డివిజన్లలో ఉత్సవాలు జరపనుంది. ప్రతి డివిజన్​కు ఒక చర్చి, నియోజకవర్గానికి రెండు చర్చిలతో మొత్తం 198 చర్చిల్లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్​మెంట్ విభాగం ఆధ్వర్యంలో కేక్ కటింగ్, భోజనాలతో వేడుకలు నిర్వహించనుంది. 

అలాగే గ్రేటర్​లోని నియోజకవర్గానికి 75 చర్చిల చొప్పున మొత్తం 1750 చర్చిలకు పెయింటింగ్ వేయడంతో పాటు డిజిటల్ లైటింగ్ ఏర్పాటు చేయనుంది. నిధుల విడుదల కోసం చర్చిల పాస్టర్లు లేదా స్థానికులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక విలీనమైన 27 లోకల్ బాడీల్లో ఎప్పటిలాగే ఆయా జిల్లా కలెక్టరేట్ల ఆధ్వర్యంలో ఈ ఏడాది క్రిస్మస్ ఉత్సవాలను నిర్వహించనున్నారు.