పాజిటివ్ వ‌చ్చిన వారంద‌రిని హోం ఐసోలేష‌న్ లోనే ఉంచాం

పాజిటివ్ వ‌చ్చిన వారంద‌రిని హోం ఐసోలేష‌న్ లోనే ఉంచాం

క‌రోనా క‌ట్ట‌డి అమ‌లులో ‌జీహెచ్ఎంసీ , వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాయన్నారు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం క‌రోనా పాజిటివ్ కేసులు‌ హోం ఐసోలేష‌న్ లోనే ఉన్నారన్నారు. ప్ర‌స్తుతం న‌గ‌రంలో 2192 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారని, వారంద‌రి ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తిరోజు రెండు విడ‌త‌లుగా వారిని మానిట‌రింగ్ చేస్తున్నామ‌న్నారు. ఎమ‌ర్జెన్సీ పేషంట్‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించేందుకు అనువుగా హోం ఐసోలేష‌న్ ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. కంటైన్‌మెంట్ చేసిన ఏరియాలు, అపార్ట్‌మెంట్‌లో ప‌టిష్ట‌మైన బారీకేడింగ్ ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉంచిన వ్య‌క్తులు నివాసముంటున్న ఇంటిని మాత్ర‌మే కంటైన్ చేస్తున్నామ‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం ఐసోలేష‌న్‌లో ఉన్న 17 మందికి అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల కోసం హాస్పిట‌ల్స్‌కు త‌ర‌లించామ‌ని చెప్పారు.