జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక సూచన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్​పై అభ్యంతరాలను మంగళవారం సాయంత్రం సమర్పించాలని రాజకీయ పార్టీలను జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

320 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 స్టేషన్లను, 132 లొకేషన్ల నుంచి 139కి ప్రతిపాదించామని వివరించారు. అదనంగా 79 కొత్త స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రేషనలైజేషన్ నివేదిక ఆగస్టు 28న ఎన్నికల కమిషన్​కు పంపాల్సి ఉండగా, అభ్యంతరాలను 26 లోగా తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. 

నోడల్ అధికారుల నియామకం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్  14 మంది నోడల్ అధికారులను నియమించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.