
- కమిషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నిమజ్జనాలను సురక్షితంగా, ఎకో- ఫ్రెండ్లీగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. శనివారం సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్లెస్ రోడ్, అమీర్‌పేట, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనుల నాణ్యతను ఆయన పరిశీలించారు. బారికేడింగ్, లైటింగ్, క్యూ లైన్లు, కంట్రోల్ రూమ్ఏర్పాట్లను పరిశీలించి నిమజ్జనం సజావుగా జరిగేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం జరగాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు, శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ అంశాలపై బహుముఖ వ్యూహంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ తదితరులు ఉన్నారు.