
హైదరాబాద్, వెలుగు: మంగళవారం జరిగిన బల్దియా కౌన్సిల్ మీటింగ్‌లో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి రూ.6,841.87 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో జీహెచ్ఎంసీకి రూ.5,600 కోట్లు, డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.1,241.87 కోట్లు కేటాయించారు. రెవెన్యూ ఆదాయం రూ.3,571 కోట్లు, మూలధన ఆదాయం రూ.983.04 కోట్లుగా చూపించారు. అధిక శాతం ఆదాయంగా రూ.1,850 కోట్లు ఆస్తి పన్ను రూపంలో లభించనుంది. మొత్తం వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,414 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ.3,186 కోట్లుగా చూపించారు. ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో ఇప్పటికే ఖర్చు చేసిన వివరాలు పెట్టక పోవడంపై ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ను వివరణ అడగ్గా అన్ని వివరాలు పంపిస్తామని చెప్పారు. బల్దియా హెడ్డాఫీసు నుంచి వర్చువల్ మీటింగ్ మేయర్అధ్యక్షనత నిర్వహించగా కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు పాల్గొన్నారు. ఎంఐఎం కార్పొరేటర్లు పార్టీ ఆఫీసు దారుసలాం నుంచి గ్రూప్‌గా పాల్గొన్నారు. మిగతా వారు ఇండ్లు, పార్టీ ఆఫీసుల నుంచి హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు.
రేపటి నుంచి పట్టణ ప్రగతి
రేపటి నుంచి పది రోజుల పాటు పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నట్టు మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. దీనికి రూ.936 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి పనులపై సమీక్ష, సీజనల్ వ్యాధుల నివారణకు శానిటేషన్, నీటి నిల్వలు, దోమల నివారణకు స్ప్రేయింగ్, చెత్త , రోడ్ల వెంట పిచ్చి మొక్కలు, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, ఖాళీ స్థలాల్లో మొక్కల పెంపకం తదితర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆమె వివరించారు. కార్పొరేటర్లు , ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్లాన్ రూపొందించిందన్నారు.పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్, వెబ్ సైట్‌ను రూపొందించామని వివరించారు. చెత్త సేకరణకు 90 మినీ ట్రాన్స్ఫర్ పాయింట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఏడాదిలో హరిత హారంలో కోటిన్నర మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు.
వానాకాలం, శానిటేషన్ పనులపై నిలదీత
వానాకాలం, శానిటేషన్ పనులపై ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు నిలదీశారు. వారు అడిగిన ప్రశ్నలకు అధికారులు జవాబులు చెప్పలేకపోయారు. వానలు పడుతున్నా ఇంకా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయలేదని పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ నిర్వహణపై ఎంఐఎం కార్పొరేటర్లు సున్నం రాజ్ మోహన్, మహ్మద్ మాజీద్ హుస్సేన్, శంకర్ యాదవ్ ప్రశ్నలు అడిగారు. నాలాల పూడిక పనులపై జాంబాగ్ బీజేపీ రాకేశ్ జైస్వాల్, హరితహారంపై ఏఎస్రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా రెడ్డి, నల్ల చెరువు బ్యూటిఫికేషన్‌పై ఉప్పల్కార్పొరేటర్ ఎం.రజిత, పటేల్ కుంట చెరువు బ్యూటిఫికేషన్ పై నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ ప్రశ్నించారు. వానాకాల ప్లానింగ్‌పై చంపాపేట బీజేపీ కార్పొరేటర్వంగ మధుసూదన్ రెడ్డి, శ్మశానాల అభివృద్ధిపై చిలుకానగర్బన్నాల గీతా ప్రవీణ్ ప్రశ్నలు అడిగారు. బాలానగర్‌లోని కెమికల్ నాలాపై రిటైనింగ్ వాల్ నిర్మాణంపై బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, వివిధ అభివృద్ది పనులపై మాదాపూర్ కార్పొరేటర్జగదీశ్వర్ గౌడ్ అడిగారు. ఓల్డ్ సిటీకి స్వచ్ఛ ఆటోలు రావడంలేదని ఎంఐఎం కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ జనాభాకు అనుగుణంగా 4,166 స్వచ్ఛ ఆటోలుండాలని, కానీ 2,500 ఉంటే ఎలా సరిపోతాయని మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. టెక్నికల్ప్రాబ్లమ్స్తో కొందరు కార్పొరేటర్లకు మాట్లాడే చాన్స్ దక్కలేదు. మరికొందరు మాట్లాడుతుంటే ఆడియో మ్యూట్చేశారు. బడ్జెట్‌పై చర్చించేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లకు అవకాశమే ఇవ్వలేదని కార్పొరేటర్ రజితా రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.