- ప్రారంభించిన డిప్యూటీ మేయర్ శ్రీలత
జూబ్లీహిల్స్ , వెలుగు: బంజారాహిల్స్ రోడ్ నంబర్1లోని లేబుల్స్ పాప్- అప్ స్పేస్లో ఏర్పాటు చేసిన డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను బల్దియా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పలు స్టాళ్లను పరిశీలించి మాట్లాడారు. విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్ర ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించడం అభినందనీయమన్నారు. నేరుగా చేనేత కారుల నుంచి కస్టమర్లకు అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు.
నిర్వాహకులు మాట్లాడుతూ.. చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలు డిసెంబర్ 22 వరకు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయన్నారు. పటాన్ పటోలా, బర్హౌని, బెనారసి, పైథాని, కాశ్మీరీ, మహేశ్వరి, కాంచీపురం, గద్వాల్, లక్నో, అజ్రాఖ్చీరలు, సూట్లు, కుర్తీలు, డ్రెస్ మెటీరియల్, ఆభరణాలు, బెడ్ షీట్‌లు తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు.
