- రేపు స్టాండింగ్ కమిటీ ముందుకు ప్రపోజల్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ను రూపకల్పన చేసింది. దాదాపు రూ.11,460 కోట్లతో బడ్జెట్ముసాయిదా సిద్ధం చేసింది. గత ఆర్థిక సంవత్సరం రూ.11,010 కోట్లతో పోల్చితే రూ.450 కోట్లు పెంచింది. ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 లోకల్ బాడీల అవసరాలు, అభివృద్ది, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ ముసాయిదాను రూపొందించినట్లు సమాచారం.
ఈ ముసాయిదాను ఈ నెల 29న జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టనున్నారు. కమిటీ అభిప్రాయాలు స్వీకరించి అవసరమైన మార్పులు చేస్తారు. ఆ తర్వాత వచ్చే నెలలో నిర్వహించనున్న స్పెషల్ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ను ఆమోదించి, తదుపరి ఆమోదం కోసం సర్కారుకు పంపనున్నారు.
