ఫాంహౌస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రావాలి

ఫాంహౌస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రావాలి

హైదరాబాద్: ఫాంహౌస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రావాలని అన్నారు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ… ‌సీట్లు పెంచుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. బీజేపీ అభ్యర్థే మేయర్ అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందన్నారు. బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్ నాలాలపై అక్రమ కట్టడాలను తొలగించే పనిని బీజేపీ చూసుకుంటోందని, ఆరేళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నాలాలను పట్టించుకోలేదని అన్నారు

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని, సిటీలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని అమిత్ షా ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరితోనూ సమావేశం కాలేదని విమర్శించారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదన్న సీఎం కేసీఆర్ మాటలను అమిత్ షా ఖండించారు. తెలంగాణలో లక్షా 30వేల ఇళ్ళకు కేంద్రం నిధులిచ్చిందని అన్నారు. చిరు వ్యాపారులకు కేంద్రం ఇచ్చిన లోన్లు లభించిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉన్నారని అన్నారు.