కరోనా పేషెంట్లకు నేటి నుంచే పోస్టల్ బ్యాలెట్ అవకాశం

కరోనా పేషెంట్లకు నేటి నుంచే పోస్టల్ బ్యాలెట్ అవకాశం

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కరోనా పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు  అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకోవాలనుకునే వారు ఈరోజు నుండే దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. ఈనెల 29వ తేది ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగుస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1వతేది పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపధ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కరోనా పేషెంట్లకు సూచించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్… కౌంటింగ్ వివరాలు

ప్రచారం ముగిసేది: 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు

పోలింగ్: డిసెంబర్ 1 మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు

రీపోలింగ్: డిసెంబర్ 3వ తేదీన గురువారం (ఒక వేళ పోలింగ్ జరగని పరిస్థితి ఏర్పడితే)

కౌంటింగ్: డిసెంబర్  4న పొద్దున 8  నుండి మధ్యాహ్నం 3.30 కంప్లిట్ అయ్యే అవకాశం. ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాలలో  లేట్ అయ్యే అవకాశం

మద్యం షాప్ లు మూత: ఈనెల 29వ తేది సాయంత్రం 6 గంటల నుండి 1 వ తేది రాత్రి 7 గంటల వరకు

గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం ఓటర్లు:  74 లక్షల 4 వేల 286 మంది ఓటర్లు ( పురుష ఓటర్లు 38,04,286, మహిళా ఓటర్లు 35,46,857.. ఇతరులు 669)

ఎన్నికలకు పరిశీలకులు:  మొత్తం 6 జోన్ లు..  జోన్ లకు ఆరుగురు చొప్పున సాధారణ ఎన్నికల పరిశీలకులు

గ్రేటర్ లో మొత్తం వార్డులు:  150 వార్డులు.

పరిశీలకులు: 30 సర్కిల్ లకు ఎన్నికల వ్యయ పరిశీలకులు. మరో 30 సహాయక వ్యయ పరిశీలకులు.

మొత్తం పోలింగ్ కేంద్రాలు:  9101

మొత్తం బ్యాలెట్ బాక్సులు: 28,500

పోలింగ్ సామగ్రి పంపిణీకి బ్డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు:  30

కౌంటింగ్  కేంద్రాలు:  30

మొత్తం సమస్యాత్మక ప్రాంతాలు: 2700

ప్రాంతాలు:  913

సమస్యాత్మక పోలింగ్ సెంటర్ లు మొత్తం:  1439

సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలు:  532

అత్యంత సమస్యాత్మక  ప్రాంతాలు: 308

అత్యంత సమస్యాత్మక  పోలింగ్ కేంద్రాలు: 1004

క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు:  257

క్రిటికల్ పోలింగ్ ఏరియాలు:  73

గ్రేటర్ ఎన్నికలకు పనిచేస్తున్న ఎన్నికల సిబ్బంది:  48,000 మంది, పోలీస్ సిబ్బంది దాదాపు  30,000 మంది.

గ్రేటర్ హైదరాబాద్ లో అతి పెద్ద డివిజన్: మైలార్ దేవ్ పల్లి – 79,290 ఓట్లు

అతి చిన్న డివిజన్ రామ చంద్ర పురం: 27,948 ఓట్లు

పోలింగ్ సందర్భంగా నిబంధనలు:   ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి, థర్మల్ స్కానింగ్, శానిటైజర్.

గత మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగా గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఫేస్ రికాగ్న జేషన్ యాప్ సర్కిల్ ఒక పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేయనున్న ఎన్నికల కమిషన్.

బ్యాలెట్ బాక్స్ లను డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఆర్టీసీ కార్గో వాహనాలను వినియోగించనున్నారు.

Read More News….

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే..

ఆ రైలు పరుగుల వెనుక ‘‘పింక్ గ్యాంగ్’’

వెరైటీ వెడ్డింగ్ కార్డు: మట్టిలో పెడితే పూలు, కూరగాయల మొక్కలు మొలకెత్తుతాయి